Railway Recruitment Board | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్టులను భర్తీ చేసేందుకు భారతీయ రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 20 నుంచి ప్రారంభంకానుండగా.. ఫిబ్రవరి 19 వరకు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 5,696
పోస్టులు : అసిస్టెంట్ లోకో పైలట్
రీజియన్లు: జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ తదితరాలు.
అర్హతలు : మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
వయసు: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ప్రారంభం : జనవరి 20
దరఖాస్తు చివరి తేది: ఫిబ్రవరి 19
వెబ్సైట్ : https://indianrailways.gov.in/