NEEPCO Recruitment 2023-24 | మెడికల్, సెక్యూరిటీ, సేఫ్టీ తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Executive Jobs) భర్తీకి మేఘాలయాలోని నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(నీప్కో) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రూటినీ, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఏంపిక చేయనున్నారు. దరఖాస్తు విధానం ఆఫ్లైన్లో ఉండగా.. ఏప్రిల్ 24 అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 09
పోస్టులు : ఎగ్జిక్యూటివ్ పోస్టులు
విభాగాలు: మెడికల్, సెక్యూరిటీ, సేఫ్టీ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 32-38 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.82320-రూ.113540
ఎంపిక : స్క్రూటినీ, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.300
దరఖాస్తు : ఆఫ్లైన్లో
అడ్రస్ : NEEPCO, GPO వద్ద పోస్ట్ బాక్స్ నం.89, షిల్లాంగ్-793001 (మేఘాలయ)
చివరి తేది: ఏప్రిల్ 24
వెబ్సైట్ : https://neepco.co.in