నేడు పురపోరు.. మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు
మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అలియాబాద్, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 68 వార్డులకు పోటీ జరుగుతుండగా 68 వార్డులకు గాను 136 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- 68 వార్డులకు 136 కేంద్రాల ఏర్పాటు
మేడ్చల్, ఫిబ్రవరి10(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అలియాబాద్, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 68 వార్డులకు పోటీ జరుగుతుండగా 68 వార్డులకు గాను 136 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 65,863, 136 పోలింగ్ కేంద్రాల్లో 818 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లను, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను నియమించారు.
అలియాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 20,451 ఓటర్లు ఉండగా పురుషులు 10,336, మహిళలు 10,115 ..ఎల్లంపేట్ మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 22,581 ఓటర్లు ఉండగా పురుషులు 11,285, మహిళలు11,296… మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 22,831 ఓటర్లకు గాను పురుషులు 11,430, మహిళలు 11,401 ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి, సిబ్బందిని అధికారులు తరలిస్తున్నారు. కేంద్రాలను ఎన్నికల పరిశీలకురాలు నిర్మల కాంతి వెస్లీతో కలిసి కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. సామగ్రి, సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు నిర్ణిత సమయంలో చేరుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

