IIM Kashipur Recruitment 2023 | ఎస్టేట్, ఇంటర్నల్ ఆడిట్, జనరల్ అడ్మిన్ తదితర విభాగాలలో సీనియర్ అడ్మిన్ ఆఫీసర్ (Senior Admin Officer), ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ (Internal Audit Officer), అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్(Administrative executive), అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వంటి నాన్ టీచింగ్ (Non Teaching) పోస్టుల భర్తీకి ఉత్తరాఖండ్ రాష్ట్రం కాశీపుర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. ఆగష్టు 19 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 40
పోస్టులు : సీనియర్ అడ్మిన్ ఆఫీసర్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
విభాగాలు : ఎస్టేట్, ఇంటర్నల్ ఆడిట్, జనరల్ అడ్మిన్
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : 40 నుంచి 60 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
చివరి తేది: ఆగష్టు 19
వెబ్సైట్ : https://www.iimkashipur.ac.in/