GGH Kakinada Recruitment 2023 | కాకినాడ ప్రభుత్వ జనరల్ దవాఖాన (Govt General Hospital)లో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి కాకినాడలోని ప్రభుత్వ సర్వజన దవాఖాన, సూపరింటెండెంట్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జీఎన్ఎం, బీఎస్సీ(నర్సింగ్), ఎంఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. జూన్ 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 97
పోస్టులు : స్టాఫ్ నర్స్
అర్హతలు: జీఎన్ఎం, బీఎస్సీ(నర్సింగ్), ఎంఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : రూ.400. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
వయస్సు : 42 ఏండ్లు మించకుడదు
ఎంపిక : అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా
దరఖాస్తు విధానం : దరఖాస్తులను పోస్టు ద్వారా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 533001 అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: జూన్ 30
వెబ్సైట్ : https://eastgodavari.ap.gov.in/