డీఆర్డీవోలో అప్రెంటిస్లు.. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసినవారు అర్హులు
DRDO | రక్షణ శాఖ పరిధిలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ అందిస్తుంది

హైదరాబాద్: రక్షణ శాఖ పరిధిలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ అందిస్తుంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసినవారు అర్హులని తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 7 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
మొత్తం ఖాళీలు: 150
ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 40, టెక్నీషియన్ (డిప్లొమా) 50, ట్రేడ్ అప్రెంటిస్ 60 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, మెకానికల్, కెమికల్లో ఇంజినీరింగ్, బీకామ్, బీఎస్సీ, డిప్లొమా, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి. అయితే అభ్యర్థులు 2019, 2020, 2021లో ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 7
వెబ్సైట్: https://rcilab.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

