District Medical & Health Officer | నాగర్‌కర్నూలు జిల్లా (Nagarkurnool District) లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ (Civil Assistant Surgeon) పోస్టుల భర్తీకి నాగర్‌కర్నూలులోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 21 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ (MBBS) ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది.
మొత్తం పోస్టులు : 21
పోస్టులు : సివిల్ అసిస్టెంట్ సర్జన్
అర్హతలు : ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం: దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, పాలెం, నాగర్‌కర్నూలు జిల్లా అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 02
వెబ్సైట్ : https://nagarkurnool.telangana.gov.in/departments/health/