న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 249 కేసులను భర్తీ చేస్తున్నది. ఫిజికల్ టెస్ట్, ట్రయల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 249
ఇందులో మహిళలకు 68, పురుషులకు 181 చొప్పున కేటాయించారు.
అర్హతలు: అభ్యర్థులు ఇంటర్ పాసై, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఏదైనా క్రీడాలో పాల్గొని ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఫిజిలక్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియెన్సీ టెస్ట్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 31
వెబ్సైట్: https://www.cisf.gov.in/