బెంగళూరు: సెంట్రల్ సిల్క్ బోర్డులో (CSB) ట్రైనర్, ట్రెయినింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నవంబర్ 17 వరకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 60 పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు కర్ణాటకలోని బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 60
ఇందులో ట్రెయినర్ 30, ట్రెయినింగ్ అసిస్టెంట్ 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: టెన్త్, ఇంటర్, ఐటీఐ చేసి సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 8
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 17
వెబ్సైట్: rond.csb@nic.in