న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)లో అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 22 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 71
ఇందులో జనరల్ 28, ఎస్సీ 10, ఎస్టీ 7, ఓబీసీ 19, పీడబ్ల్యూడీ 6, ఈడబ్ల్యూఎస్ 7 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: కెమిస్ట్రీ (ఇనార్గానిక్, ఆర్గానిక్, అనలిటికల్, ఫిజికల్, అప్లైడ్ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)లో పీజీ చేసి 30 ఏండ్లలోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితిలో మినహాయింపులు ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, గ్రూప్డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
రాత పరీక్షను నవంబర్ 11న నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 22
వెబ్సైట్: www.iocl.com