Agricultural Scientists Recruitment Board | దేశంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏఎస్ఆర్బీ) నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత రంగంలో పీజీ, పీహెచ్.డీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగష్టు 18 నుంచి ప్రారంభంకానుండగా.. సెప్టెంబర్ 08వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 368
పోస్టులు: ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్
అర్హతలు : సంబంధిత రంగంలో పీజీ, పీహెచ్.డీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 08
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
వెబ్సైట్: http://www.asrb.org.in