ఈసీఐఎల్‌లో 300 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
ECIL | ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: నగరంలోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 21 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీ చేస్తున్నది. కాంట్రాక్టు ప్రాతిపదికన అభ్యర్థులను నియమిస్తున్నది. పనితీరు ఆధారంగా ఐదేండ్ల వరకు కాంట్రాక్టు కాలాన్ని పొడిగిస్తారు. బీఈ, బీటెక్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
మొత్తం పోస్టులు: 300
ఇందులో జనరల్ 136, ఈడబ్ల్యూఎస్ 15, ఓబీసీ 77, ఎస్సీ 50, ఎస్టీ 22 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెటేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో 60 మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులవాలి. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏడాది అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 30 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 21
వెబ్సైట్: http://careers.ecil.co.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

