వినాయక్ నగర్ : జిల్లా సెంట్రల్ జైల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ శివారులోని సారంగాపూర్లో కేంద్ర కారాగారంలో జైలు సూపరింటెండెంట్ ( Jail Superintendent ) చింతల దశరథం పర్యవేక్షణలో యోగ దినోత్సవాన్ని( Yoga Day ) నిర్వహించారు.
జైలు అధికారులు, సిబ్బంది, ఆశ్రమ వాసులతో కలిసి యోగ మాస్టర్ జలంధర్ గౌడ్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు యోగా చేయించారు. యోగాతో మానసిక, శారీరకంగా మేలు చేస్తుందని అన్నారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారి మనసు ధ్యానం వైపు ఉండేట్లుగా పిరమిడ్ స్విచ్యువల్ సొసైటీ మూమెంట్ స్థాపకులు బ్రహ్మ ఋషి సుభాష్ పత్రీజీ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మల్లు గౌడ్, రజిత వాణి, వెంకటేష్, మహేష్, పతాంజలి యోగ కేంద్రం సాయిలు, జిల్లా యోగా మాస్టర్ ప్రభాకర్, కిషన్ పాల్గొన్నారు. కేంద్ర కారాగారం అధికారులు డాక్టర్ దినేష్ గంగా, సాయి సురేష్ బాబు, రాజశేఖర్ రెడ్డి, ఉపేందర్, జైలర్లు అనిల్ కుమార్, మన్మధరావు, డిప్యూటీ జైలర్ అశోక్ కుమార్, నారాయణ తదితరుల పాల్గొన్నారు.