కులవృత్తులను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తే.. బీఆర్ఎస్ జీవం పోసింది
సమైక్య పాలనలో కులవృత్తులు జీవం కోల్పోయాయని.. లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి వారి జీవనం దుర్భరంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పదేండ్లలోనే సీఎం కేసీఆర్ కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చారన్నారు.
- కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చింది సీఎం కేసీఆరే..
- గౌడ, గీత కార్మికుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కృషి
- రాష్ట్రంలోని 20 లక్షల మంది గౌడ కులస్తులు, గీత కార్మికులకు అండగా సర్కారు
- సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే బీఆర్ఎస్ను గెలిపిస్తాయి..
- కాంగ్రెస్, బీజేపీ భూస్థాపితం కావడం ఖాయం
- ‘నమస్తే తెలంగాణ’తో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, రూరల్ సెగ్మెంట్ ఎన్నికల ఇన్చార్జి వి.గంగాధర్‌గౌడ్
సమైక్య పాలనలో కులవృత్తులు జీవం కోల్పోయాయని.. లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి వారి జీవనం దుర్భరంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పదేండ్లలోనే సీఎం కేసీఆర్ కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చారన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 767జీవోను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసి 25వేల మంది గౌడ, గీత కార్మికులను సీఎం కేసీఆర్ ఆదుకున్నారని తెలిపారు. ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకు చెల్లించాల్సిన ఎక్స్‌గ్రేషియాను సైతం కాంగ్రెస్ చెల్లించలేదని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే రూ.14 కోట్ల బకాయిలను చెల్లించి అండగా నిలిచిందన్నారు. కులవృత్తులను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సబ్బండవర్ణాల ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకే సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వచ్చి కేసీఆర్.. హ్యాట్రిక్ సీఎం అవుతారన్నారు. ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో వీజీ గౌడ్ పలు విషయాలను పంచుకున్నారు.
– డిచ్పల్లి, నవంబర్ 10
ఉమ్మడి రాష్ట్ర పాలనలో కాంగ్రెస్, బీజేపీ పాలకులు అనుసరించిన విధానాలతో కులవృత్తులు ఆదరణ కోల్పోయి వాటిపై ఆధారపడిన వారందరూ ఉపాధి కోసం అల్లాడిపోయారు. ఏండ్లుగా కులవృత్తులను నమ్ముకొని కుటుంబాలను భారంగా పోషించుకున్నా.. ప్రోత్సాహం కరువైంది. క్రమంగా వృత్తుల నుంచి దూరమయ్యారు. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడడంతో వారి జీవన స్థితిగతులు దుర్భరంగా తయారయ్యాయి. ఆనాటి పాలకులు అవలంబించిన నిరంకుశత్వంతో ఉపాధికి దూరమై బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చింది. పదేండ్ల పాలనలో కులవృత్తులకు సీఎం కేసీఆర్ జీవం పోసి ఆర్థిక పరిపుష్టిని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు… ఇలా సబ్బండవర్గాలు సంతోషంగా ఉండేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెబుతున్నారు మాజీ ఎమ్మెల్సీ, రూరల్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి వి.గంగాధర్‌గౌడ్. నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వీజీగౌడ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈత, తాటి చెట్లపై ఎక్కి కల్లు గీసే క్ర మంలో ప్రమాదవశాత్తు కింద పడి చనిపోతే ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆ కుటుంబానికి రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించేవారు. తెలంగాణ ఏర్పడిన నాటికి ఎక్స్‌గ్రేషియా చెల్లించకుండా రూ.14 కోట్లు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లోనే ఉంచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్స్‌గ్రేషియా బకాయి రూ.14 కోట్లు గీత కార్మికుల కుటుంబాలకు చెల్లించి అండగా నిలిచింది. అంతేకాకుండా రూ.2 లక్షలు ఉన్న ఎక్స్‌గ్రేషియాను బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5లక్షలకు పెంచింది. దేశంలోనే తొలిసారిగా వైన్స్ టెండర్లలో గౌడ కులస్తులకు 15శాతం రిజర్వేషన్ కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 50ఏండ్లు నిండిన 70వేల మంది గౌడ సంఘ సభ్యులు నెలకు రూ.2016 ఆసరా పింఛన్ అందుకుంటున్నారు.
కాంగ్రెస్, బీజేపీల భూస్థాపితం ఖాయం..
ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు భూస్థాపితం కావడం ఖాయం. మోసపూరిత, మాయమాటలు, అబద్ధపు ప్రచారాలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. సబ్బండవర్ణాల ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకే సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వచ్చి కేసీఆర్.. హ్యాట్రిక్ సీఎం అవుతారు.
రాష్ట్ర రాజధాని జంటనగరాల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 767 జీవోను తీసుకువచ్చి 50కిలోమీటర్ల లోపు ఈత, తాటివనా లు లేకపోతే కల్లు సొసైటీలను రద్దు చేయాలని నిర్ణయించి కల్లు దుకాణాలన్నింటినీ పూర్తిగా మూసివేసింది. దీంతో లక్షలాది గౌడ కుటుంబాలు, గీత కార్మికులు ఉపాధి కోల్పోయారు. కుటుంబాలను పోషించుకోవడంలో ఆర్థికంగా చితికిపోయి ఎన్నో బాధలు అనుభవించారు. కల్లు దుకాణాలు తెరిచేందుకు అనుమతివ్వాలని, తమకు ఉపాధి కల్పించాలని గౌడ కులస్తులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టినా అప్పటి పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు.
సంక్షేమం, అభివృద్ధి పనులే గెలిపిస్తాయి..
బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించేందుకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వేలాది కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులే శ్రీరామరక్షగా నిలుస్తాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి మూడోసారి బరిలో నిలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం. ప్రజలతో మమేకమై, అందరికీ అందుబాటులో ఉంటూ అంకితభావంతో వారి సమస్యల పరిష్కారానికి బాజిరెడ్డి కృషి చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో 29వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన బాజిరెడ్డి.. ఈసారి రెట్టింపు మెజార్టీతో గెలుస్తారు.
లైసెన్సులను పెంచింది.. చెట్ల పన్ను రద్దు చేసింది కేసీఆరే..
ఏండ్లుగా డిమాండ్ చేస్తున్న చెట్ల పన్ను (రెంటల్)ను 2017లో సీఎం కేసీఆర్ రద్దు చేసి గౌడ కులస్తులందరికీ ఉపశమనం కల్పించారు. కల్లు దుకాణాలు నడుపుకొనేందుకు ఐదేండ్లకోసారి రెన్యువల్ చేసుకోవాల్సిన లైసెన్స్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లకు పెంచింది. పెండింగ్‌లో ఉన్న టీఎఫ్టీ లైసెన్స్‌లను మంజూరు చేసింది. అంతేగాకుండా టీఎఫ్టీలను టీసీఎస్‌లుగా మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.
కేసీఆర్ అంటేనే భరోసా..
జంట నగరాల్లో గౌడ కులస్తులకు ఉపాధిని దూరం చేసిన 767జీవోను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. 157 కల్లు దుకాణాలను వెంటనే తెరిపించింది. ఫలితంగా 25వేల మంది గౌడ, గీత కార్మికులను సీఎం కేసీఆర్ ఆదుకున్నారు. గీత వృత్తిని కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చెరువు కట్టలు, కాలువ గట్లపై 4కోట్ల ఈత, తాటి మొక్కలను నాటించింది. ప్రస్తుతం అవి చెట్లుగా మారడంతో గీత కార్మికులు స్వచ్ఛమైన కల్లును గీసి విక్రయాల ద్వారా ఉపాధి పొందుతున్నారు.
కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చింది బీఆర్ఎస్సే..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20లక్షల మంది గౌడ కులస్తులు బీఆర్ఎస్ ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకా లు, గీత వృత్తి ద్వారా లబ్ధి పొందుతున్నారు. గొల్ల, కుర్మ యాదవులకు గొర్రెల పంపిణీ, నాయీబ్రాహ్మణ, చాకలి తదితర కులస్తులకు తమ వృత్తిని కొనసాగించేందుకు పలు సబ్సిడీ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల అమలుతో గల్ఫ్ వెళ్లేవారి సంఖ్య తగ్గింది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

