Ponnam Prabhakar | శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటాం.. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
విధి నిర్వహణలో మరణించిన పోలీసు వడ్ల శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండల కేంద్రానికి చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ ములుగు జిల్లా వాజేడు లో సమీపంలోని కర్రెగుట్ట వద్ద ఆపరేషన్ కగార్ లో భాగంగా గురువారం మందు పాతర పేలడం తో మృతి చెందాడు.
Ponnam Prabhakar | కామారెడ్డి: పోలీసు వడ్ల శ్రీధర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి శుక్రవారం పాల్వంచకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వడ్ల శ్రీధర్ కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిస్కరించుకోవాలని, హింసా మార్గాన్ని విడనాడాలని ఆయన అన్నారు. మరణించిన శ్రీధర్ కుటుంబానికి రూ.2.17 కోట్ల ఆర్థిక సాయం ప్రభుత్వం నుండి అందినున్నట్లు తెలిపారు.
తొలుత శ్రీధర్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ రావు, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ పార్థివ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రేహౌండ్స్ కమాండర్ ఆపరేషన్ రాఘవెందర్ రెడ్డి, ఓఎస్డీ దయానంద్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ శంకరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవిన్యూ వీ విక్టర్, ఆర్డీవో వీణ, పోలీసు, రెవిన్యూ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రుణ మోసం కేసు దర్యాప్తు అధికారం ఈడీకి ఉన్నది: హైకోర్టు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

