ఆర్మూర్: నవంబర్ 15న వరంగల్‌లో నిర్వహిస్తున్న విజయగర్జన సభకు ఆర్మూర్ నియోజక కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్మూర్‌లోని పెర్కిట్ గ్రామంలో నియోజకవర్గ వరంగల్ విజయగర్జన సన్నాహాక సభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబి. రాజేశ్వర్లతో కలిసి వారు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 15న వరంగల్‌లో నిర్వహించతలపెట్టిన విజయగర్జన సభకు ఆర్మూర్ గులాబీ సైన్యం కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి విజయవంతం చేయాలన్నారు.
దేశంలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. గల్లీలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్‌ను కదిలించి బీజేపీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన దేవుడు కేసీఆర్ అన్నారు. పార్లమెంట్ సభ్యులు కేఆర్.సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు చేసిన పోరాటం ప్రపంచాన్ని సైతం ఆకర్షించిందన్నారు.
శాంతియుతంగా చేసిన తెలంగాణ ఉద్యమం యావత్ భారత దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసిందన్నారు. సన్నాహాక సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితపవన్, వైస్‌చైర్మన్ షేక్‌మున్నా, ఎంపీపీలు పస్క నర్సయ్య, వాకిడి సంతోష్‌రెడ్డి, మాస్త ప్రభాకర్, జడ్పీటీసీలు మెట్టు సంతోష్, ఎరం యమున ముత్యం, వైస్ ఎంపీపీ మోతె భోజకళా చిన్నారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు.