విద్యానగర్, జనవరి 3 : ఈ నెల 5వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్కా తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఓటరు జాబితాకు సంబంధించి 1 నుంచి 8 ఫార్మట్లను క్షుణ్ణంగా పరిశీలించారని అన్నారు. జిల్లాలో 83.19 శాతం మంది ఓటర్లు ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహణపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. జిల్లాలో 790 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. యువతీ యువకులు ఎక్కువమంది కొత్త ఓటర్లుగా నమోదు చేయించుకున్నారని చెప్పారు. అంతకుముందు ఎన్నికల పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్కాకు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీవోలు శ్రీనివాస్ రెడ్డి,శీను, ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగ్‌రావు, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.