Talent Show | నిజామాబాద్ అక్టోబర్ 14: విజయ్ పాఠశాల 45వ టాలెంట్ షోను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కే రామాచారి, గౌరవ అతిథులుగా గీత రచయిత కాసర్ల శ్యామ్, నటి, శాస్త్రీయ నృత్యకారిణి సరస్వతి కరావడి హాజరయ్యారు. డాక్టర్ కె రామాచారి ఈ మాట్లాడుతూసందర్భంగా పాఠశాల, ఉపాధ్యాయుల పాత్రను గుర్తు చేసుకొని, విద్యార్థులు శ్రద్ధతో చదివితే ఉన్నత స్థాయికి చేరగలుగుతారని చెప్పారు. . 45 సంవత్సరాలు విజయ్ పాఠశాల పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం అని రైతులు ఎంత కష్ట పడి పండిస్తారో, అలాగే విద్యార్థులకు విద్య నేర్పించి ఉన్నత స్థాయిలో కి ఎదిగేలా కృషి చేసేది పాఠశాలలు అని అని పేర్కొన్నారు.
జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ గత నలభై ఐదు ఏండ్లుగా నడుపబడుతున్న విద్యావ్యవస్థ విజయ్ పాఠశాల విజయ పతాకంతో ముందుకు సాగుతుందన్నారు. డాక్టర్ అమృతలత రచయితగా, రాజకీయ వేత్తగా వివిధ రంగాల్లో ప్రవీణ్యురాలై విద్యార్థులను తీర్చి దిద్దుతున్న ఘనత ఆమెకే దక్కుతుందని చెబుతున్న నాకు గర్వంగా ఉందన్నారు. శాస్త్రీయ నృత్యకళాకారిణి సరస్వతి కరావడి మాట్లాడుతూ.. విద్యార్థులు తల్లిదండ్రులకు, గురువులకు గౌరవం ఇవ్వాలని.. వారిని వరవకూడదన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్ణయించుకొని ముందుకు సాగాలని సూచించారు. వార్షికోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
విద్యార్థులకు 2025-26 సంవత్సరానికి అన్ని రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా పురస్కారాలను అందించారు. అనంతరం ముఖ్య అతిథులను విజయ్ పాఠశాల తరఫున మెమెంటో, శాలువాలతో సత్కరించారు. టాలెంట్ షో కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రతి ఒక్కరిని అలరించాయి. సినీ పాటలపై చిన్నారులు, విద్యార్థులు చేసిన డాన్స్లు, భరతనాట్యం ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల కార్యదర్శి అమృతలత, రమాదేవి, లలిత దేవి, విజయ భారతి, విజయ లక్ష్మి, మధు, కరస్పాండెంట్ ప్రభాదేవి, అకాడమిక్ డైరెక్టర్ వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సుజాత, ప్రిన్సిపల్ విజేత, అధ్యాపక బృందం పాల్గొన్నారు.