ఖలీల్‌వాడి, జూన్ 18 : జీజీహెచ్‌లో ఇటీవల న్యూరో సర్జరీ సేవలు ప్రారంభించామని, ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ తరహాలో యూరాలజీ సేవలను అందిస్తున్నామని సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ అన్నారు. మంగళవారం ఆమె జీజీహెచ్‌లో మీడియాతో మాట్లాడారు. జీజీహెచ్‌లోని యూరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ శబరినాథ్ శస్త్రచికిత్సలను చేస్తున్నారని తెలిపారు. ఈ వారంలో షైక్ జాని, రవి అనే ఇద్దరి మూత్రాశయంలో ఉన్న రాళ్లను శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఎవరైనా మూత్రాశయంలో రాళ్లతో ఇబ్బంది పడితే వెంటనే జీజీహెచ్‌లో సంప్రదించాలని సూచించారు.
శస్త్ర చికిత్స చేయించుకున్న ఇద్దరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము ప్రైవేట్ దవాఖానకు వెళ్తే సుమారు లక్ష రూపాయలు ఖర్చయ్యేవని తెలిపారు. తమకు జీజీహెచ్‌లో శస్త్రచికిత్స ఉచితంగా చేసిన వైద్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.