Banswada | బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో యూఎఫ్‌డబ్ల్యూసీ సమీక్ష సమావేశం
బాన్సువాడ ప్రభుత్వ మాత శిశు ఆసుపత్రిలో వైద్యసిబ్బంది తో కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జే వెంకట్ ఆధ్వర్యంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తల్లులకు, పిల్లలకు అందే సేవలపై ఆరాతీశారు.
Banswada | బాన్సువాడ , నవంబర్ 26 : బాన్సువాడ ప్రభుత్వ మాత శిశు ఆసుపత్రిలో వైద్యసిబ్బంది తో కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జే వెంకట్ ఆధ్వర్యంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తల్లులకు, పిల్లలకు అందే సేవలపై ఆరాతీశారు. తల్లుల సేవలపై 12 వారాల కంటే ముందు, గర్భవతుల నమోదు, ఏంసీపీ కార్డు అవశ్యకత, మెడికల్ ఆఫీసర్స్ చెక్ అప్, నాలుగు అంతకంటే ఎక్కువ ప్రసవాలు, ప్రణాళిక తదితర అంశాలపై సమీక్షించారు.
ఆసుపత్రుల్లో కాన్పులు, పిల్లల సేవలపై జీరో డోసు, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్, పుల్ ఇమ్యూనైజేషన్ పూర్తి తదితర అంశాలను వివరించారు. జాతీయ కార్యక్రమాలైన ఎన్సీడీ కార్యక్రమం, స్క్రీనింగ్ పాలప్స్ ఎప్పటి కప్పుడు నిర్వహించాలని సూచనలు చేశారు. అన్ని ఇండికేటర్స్ లలో ఆఫ్లై, ఆన్‌లైన్‌కు తేడా లేకుండా చూసుకోవలసిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బంది దేనని అన్నారు. మెరుగైన ప్రతిభను కనపర్చాలని, లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా సరైన సమయంలో అధిగమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ రోహిత్ కుమార్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాష్ , వైద్యులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీ సిద్దిరామేశ్వర్, సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tension | పోటాపోటీగా సాగర్ నీటి విడుదల.. ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
Panchayat Elections | ఏపీలో ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికలు
అమ్మకానికి ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి?
Netflix | పాకిస్థాన్ కంటెంట్‌ను బ్లాక్ చేయండి.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!
High court | సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

