Namaste Telangana story | కోటగిరి, ఆగస్టు 25 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలోని నర్సరీ పక్కనే ప్రధాన రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి పచ్చని తీగలు అల్లుకున్నాయి. ఇది గమనించిన ‘నమస్తే తెలంగాణ’ ‘విద్యుత్ స్తంభం ఎక్కడుందో.. వెతుక్కోవాల్సిందే’ అనే శీర్షికన కథనాన్ని సోమవారం ప్రచురించింది. ఈ వార్తకు కోటగిరి ట్రాన్స్ కో అధికారులు స్పందించారు.
సోమవారం ఉదయం ట్రాన్స్ కో అధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ సిబ్బంది కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలోని నర్సరీ పక్కన విద్యుత్ స్తంభానికి అల్లుకున్న తీగలు, పిచ్చిముక్కలను శుభ్రంగా తొలగించారు. విద్యుత్ స్తంభానికి అల్లుకున్న తీగలను తొలగించడంతో స్తంభానికి ఉన్న బల్బు వెలగడంతో అంధకారం తొలగిపోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.