నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ మండలం పెగడపల్లి గ్రామ శివారులో కరెంట్ షాక్తో (Electrocution
) ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పందుల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులు రెంజల్ ( Renjal Mandal ) మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఓర్సు గంగారం, బాలమణి, కిషన్ గా గుర్తించారు.
విషయం తెలుసుకున్న బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు విజయబాబు, వెంకటనారాయణ, బోధన్ రూరల్ ఎస్సై మచ్చెందర్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాలను నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన కు తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.