వినాయక్‌నగర్, జూలై 11: నగరంలో ట్రాఫిక్ సమస్య వేధిస్తున్నది. కొన్నిచోట్ల వన్‌వే ఏర్పాటు చేయడంతో వాహనదారులు రాంగ్రూట్లో వస్తూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న వన్ వే ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రగతినగర్ నుంచి ఎల్లమ్మగుట్ట వైపు వాహనదారులు రాంగ్రూట్లో వస్తుండడంతో ట్రాఫిక్ సమస్యతోపాటు ప్రమాదాలు చేటుచేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘వన్ వే..అస్తవ్యస్తం’ శీర్షికన ఈ నెల 8న కథనం ప్రచురితమైంది. దీనిపై ట్రాఫిక్ పోలీసులు అధికారులు స్పందించారు. ప్రగతినగర్ నుంచి ఎల్లమ్మగుట్ట వైపు రాంగ్ రూట్లో వచ్చే వాహనాలను నియంత్రించేందుకు ఎల్లమ్మగుట్ట చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిబ్బందిని నియమించారు. రాంగ్ రూట్లో వచ్చే వాహనదారులను అడ్డుకొని, వారిని తిరిగి వెనక్కి ప్రగతినగర్ వైపు పంపించి వేస్తున్నారు. అంతేకాకుండా జరిమానా సైతం విధిస్తున్నట్లు తెలిపారు.