ఆర్మూర్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిరాధరణకు గురైన తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ పండుగకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చివిశ్వవ్యాప్తం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్మూర్‌లోని మండల పరిషత్ కార్యాలయం, పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసింది మన ఇందూరు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కేనన్నారు. తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ పండుగకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు.
తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు నిరుపేదల ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత పవన్, వైస్‌చైర్మన్ షేక్ మున్నా, ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, వైస్ ఎంపీపీ మోతె భోజకళా చిన్నారెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, ఎంపీడీవో గోపీబాబు , తాసిల్దార్ వేణుగోపాల్‌గౌడ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని అంగడీబజార్లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజిటెబుల్ మార్కెట్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులతో కలిసి పరిశీలించారు.ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పరిశీలించారు. వర్షంతో నష్టపోయిన రైతుల పంటల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆయన అధికారులకు సూచించారు.