Planting program | శక్కర్ నగర్ : మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మరియు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటు ఎందుకు అనుకూలమైన స్థలాలను ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడలకు పక్కనే మొక్కలు నాటేందుకు నిర్ణయించారు. ఇందుకుగాను మహిళా సంఘాల నుంచి ఎంపిక చేసిన అమృత మిత్రలతో ఆయన ఆయన మాట్లాడారు.
” ఏక్ పేడ్ మాకే నామ్ ” అనే స్లోగన్ తో మొక్కలు నాటుతున్నామని ఈ కార్యక్రమం జూన్ 5 నుంచి ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించి వారి ద్వారానే మొక్కలు నాటిస్తున్నట్లు వెల్లడించారు. నాటిన ప్రతి మొక్క సంరక్షించబడాలని ఇందుకు మహిళలు సరైన వారిని గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించనున్నట్లు, ఎంపిక చేసిన అమృత మిత్రలు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో కోరారు. ఈ సందర్భంగా అమృత మిత్రలకు కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, డీఈ యోగేష్, ఏఈ ముఖయ్యర్, మెప్మా టీఎంసీ అంగడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.