Nizamabad | పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయం.. నిజామాబాద్ అదనపు డీసీపీ శుభం ప్రకాష్
పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయమని నిజామాబాద్ అదనపు డీసీపీ శుభం ప్రకాష్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని నిజామాబాద్ జిల్లాలో ఆదివారం సైకిల్ / బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ అదనపు డీసీపీ ( అడ్మిన్ ) ఎన్ శుభం ప్రకాష్ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ చేపట్టారు.
- నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు
- పోలీస్ శాఖ ఆధ్యర్యంలో సైకిల్, బైక్ ర్యాలీ
Nizamabad | వినాయక్ నగర్, అక్టోబర్ 25 : పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయమని నిజామాబాద్ అదనపు డీసీపీ శుభం ప్రకాష్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని నిజామాబాద్ జిల్లాలో ఆదివారం సైకిల్ / బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ అదనపు డీసీపీ ( అడ్మిన్ ) ఎన్ శుభం ప్రకాష్ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని జిల్లా కేంద్రం లోని పూలాంగ్ చౌరస్తా వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ పూలాంగ్ చౌరస్తా నుండి ప్రారంభమై ప్రగతి హాస్పిటల్, ఎల్ఐసీ చౌరస్తా, కోర్టు చౌరస్తా, ధర్నా చౌక్ మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో పోలీస్ సిబ్బంది అంతర్గత భద్రత కాపాడటానికి నక్సలైట్లు , మతపరమైన విభజన శక్తులు , ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోంటూ నేరాల అరికట్టడం , మాదక ద్రవ్యాల అణచివేతకు, మహిళ భద్రతకు, తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. వీరి త్యాగాల వల్లనే ఈ రోజు దేశం సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ కమిషనరేట్‌లో ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈ నేల చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని, ఎక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకున్నా వెంటనే పోలీసులకు సమాచారమందించాలని ఈ సందర్భంగా అదనపు డీసీపీ కోరారు. అలాగే పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా పోలీసు కుటుంబాలను పరమర్శించినట్లు తెలిపారు. ఈ కార్యాక్రమంలో సీఐలు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఆర్మూడ్ రిజర్వు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ సొంతింటి పేరు ఏంటో తెలుసా..తన జీవితాన్ని మార్చిన సినిమా పేరే పెట్టుకుంది!
Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

