చందూర్, మే 13 : వరి సాగులో ఉమ్మడి జిల్లాది ఎప్పడూ ప్రథమ స్థానమే. సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో ఏటా సాగు విస్తీర్ణం కూడా పెరుగుతున్నది. బాన్సువాడ, చందూర్, రుద్రూర్, మోస్రా, కోటగిరి ప్రాంతాల రైతులు వానకాలం ముందస్తు నాట్లకు సిద్ధమవుతున్నారు. ధాన్యం దిగుబడి ఎక్కువగా రావాలంటే యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. బలమైన వరినారును తయారు చేసుకుంటే చీడపీడలను తట్టుకోవడంతోపాటు దిగుబడి అధికంగా సాధించే అవకాశం ఉన్నది. నారుమడులను సిద్ధం చేసుకోవడంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్న మెళకువలు..
అధికారుల సూచనలు పాటించాలి మన దగ్గర రైతులు ఎక్కువగా బీపీటీ-5204 రకాన్ని పండిస్తున్నారు. ఇందులో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. ఈ రకానికి ప్రత్యామ్నాయంగా ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వారు జేజీల్ -28545, కేఎన్ఎం-1638 వంటి వరి రకాలను సూచించారు. దీనిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సూచనలు పాటించాలి.
-నగేశ్‌రెడ్డి, వ్యవసాయ అధికారి, చందూర్