Bheemgal | భీంగల్లో ఘటన బాధాకరం.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేములు ప్రశాంత్రెడ్డి
భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని లింబాద్రి గుట్ట వద్ద నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
- బాధిత కుటుంబాలకు రూ.18వేల ఆర్థిక సహాయం అందజేత
- ప్రమాదానికి కారణం అయిన నీటి కుంట పరిశీలన
- బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
Bheemgal | భీంగల్ : భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని లింబాద్రి గుట్ట వద్ద నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలను ఆయన ఆదివారం పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతమని పేర్కొంటూ వారిని ఓదార్చారు.
ఈ ఘటనలో కుమార్తె, కుమారుడిని కోల్పోయిన ఓ తల్లి తీవ్ర మనోవేదనతో అదే కుంటలో దూకేందుకు ప్రయత్నించగా ఆమె కాలికి గాయమైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అలాగే చికిత్సకు సంబంధించిన ఎలాంటి బిల్లులు తీసుకోవద్దని వైద్యులకు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తహసీల్దార్, ఎంపీడీఓ తదితర అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయం అందించాలని కోరారు. ముఖ్యంగా వారికి పక్కా ఇళ్లు మంజూరు చేసే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
అదేవిధంగా ప్రమాదానికి కారణం అయిన నీటి కుంటను పరిశీలించిన ఎమ్మెల్యే వేముల ఇలాంటి విషాద ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా సంబంధిత కుంట చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయడం లేదా అవసరమైతే కుంటను పూడ్చివేయడం వంటి చర్యలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. వెంటనే ఘటన స్థలాన్ని సందర్శించాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాలకు ఖర్చుల నిమిత్తం రూ.18వేల ఆర్థిక సాయం అందజేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

