దోమకొండ, జనవరి 6: దోమకొండ గడీకోట సంస్థానాధీశుల వారసులైన కామినేని శోభనా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ‘తెలుగు సాహిత్య సదస్సు’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సాహితీ అభ్యున్నతికి సేవలు అందించిన, అందిస్తున్న పండితులు, రచయితలు, సాహితీ పరిశోధకులు, కవులు హాజరయ్యారు. తెలుగు సాహితీ వైభవంపై వక్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా దోమకొండ గడీకోట ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షకురాలు హిమబిందు వద్ద కూచిపూడిలో శిక్షణ తీసుకుంటున్న చిన్నారులతో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఆచార్య తంగెడ కిషన్ రావు, ఎన్ జయరామారెడ్డి, ఏనుగు నర్సింహారెడ్డి, ఈ శివనాగిరెడ్డి, వైద్యం వెంకటేశ్వరాచార్యులు, కుర్ర జిలేంద్రబాబు, అనంతకుమార శర్మ, అయాచితం నటేశ్వర శర్మ, మామిడి హరికృష్ణ, గడీకోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జి, 14 సంస్థానాల నుంచి వచ్చిన సాహిత్య సేవకులు, వక్తలు, కవులు, దోమకొండ గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.