నవీపేట/బాల్కొండ/ముప్కాల్, జనవరి 5: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేందుకే టీఎల్ఎం మేళాను నిర్వహిస్తున్నట్లు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. గురువారం నవీపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. పాఠశాలలో ఉపాధ్యాయులు వివిధ బోధన పరికరాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను డీఈవోతో కలిసి జడ్పీ చైర్మన్ తిలకించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్, ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ, ఎంఈవో గణేశ్‌రావు, పీఆర్టీయూ మహిళా విభాగం నాయకురాలు రాధ, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు హన్మారెడ్డి, గౌరవ అధ్యక్షుడు రచ్చ మురళి, బాలుర పాఠశాల హెచ్ఎం అనురాధ, మండలంలోని వివిధ గ్రామాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాల్కొండ మండలం కిసాన్‌నగర్, బాల్కొండ కాంప్లెక్స్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ టీఎల్ఎం మేళా గురువారం స్థానిక జడ్పీహెచ్ఎస్లో నిర్వహించారు. టీఎల్ఎంలు అద్భుతంగా తయారుచేసిన పాఠశాలను జిల్లాస్థాయికి పంపుతామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఇందిరా, సాయన్న, రిసోర్స్ పర్సన్ బోయడ నర్సయ్య, నర్సారెడ్డి, రవికుమార్, నటరాజ్, యూనియన్ నాయకులు ప్రతాప్‌రెడ్డి, రఘు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ముప్కాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఎఫ్ఎల్ఎన్-టీఎల్ఎమ్ మేళా నిర్వహించారు. ఈ నెల6న జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయిలో మేళా నిర్వహిస్తారని అందులో ఎంపికైన నాలుగింటిని రాష్ట్ర స్థాయి మేళాలో ప్రదర్శించనున్నట్లు మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సామ పద్మ, జడ్పీటీసీ బద్దం నర్సవ్వ, సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బద్దం నర్సారెడ్డి, నిర్వహణ అధికారి మనోహర్, ఎఫ్ఎల్ఎన్-టీఎల్ఎం మేళా పరిశీలకులు బోయడ నర్సయ్య, నటరాజు పాల్గొన్నారు.