రుద్రూర్, మార్చి 29: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో తెలుగుదేశం (TDP) పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఇందూర్ సాయిలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కస్టపడి పని చేయాలన్నారు. నాడు టీడీపీ చేసిన అభివృద్దె ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి కారణం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడి పని చేసి కార్యకర్తలందరి సహకారంతో పార్టీని ముందుకు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోట గోపాల్ రెడ్డి, పావులూరి వెంకటేశ్వరరావు, సీహెచ్వీ హనుమంతరావు, కృష్ణారెడ్డి, సచిన్ పటేల్, సుంకరి సాయిలు, గంగాధర్, హంగారగా సాయిలు, తదితరులు పాల్గొన్నారు.