మోర్తాడ్ : నిజామాబాద్ టెలిఫోన్ అడ్వయిజరీ కమిటీ సభ్యునిగా తాజుద్దీన్ ( Telecom Member Tajuddin ) నియామకం అయ్యారు. భారత్ సంచార్ నిగం లిమిటెడ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జులై వరకు తాజుద్దీన్ పదవీకాలంలో కొనసాగనున్నారు. బీఆర్ఎస్ (BRS) మండలం మైనారిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తాజుద్దీన్ కు పదవి దక్కడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చౌటుపల్లి గ్రామంలో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్‌రెడ్డి (KR Suresh reddy ) ని తాజుద్దీన్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తనను నమ్మి పదవి అప్పగించినందుకు కృతజ్ఞుడిగా ఉంటానని, బీఎస్ఎన్ఎల్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.