shabbir ali | మాచారెడ్డి: రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మనుగడ సాధ్యమని రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. మాచారెడ్డి గ్రామంలో సోమవారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామంలో పాదయాత్ర చేశారు.
అనంతరం ఓ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. వాడవాడలో ఇంటింటికి మన రాజ్యాంగ అవశ్యకతను తెలుపుతూ మహాత్మా గాంధీ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని చేత పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరకంగా నిరసనలు తెలిపి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కత్తి వెంకటస్వామి, మాజీ ఎంపీపీ నర్సింగరావు, నౌసిలాల్ నాయక్, పల్లె రమేష్ గౌడ్ ,బ్రహ్మానందరెడ్డి, గణేష్ నాయక్, పొదర్ల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.