బోధన్ రూరల్ : విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలంటే కష్టపడి చదవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సాలూర ఎంఈవో రాజీ మంజూష ( MEO Raji Manjusha ) అన్నారు. శుక్రవారం సాలూర మండల కేంద్రంలోని వాగ్దేవి పాఠశాల ( Vagdevi School ) వార్షికోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు . విద్యార్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
విద్యార్థులు చదువుల్లో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఉత్తమ మార్కులు సాధించి పాఠశాలకు, గ్రామానికి, జిల్లాకు , తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో వాగ్దేవి పాఠశాల కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్, కృష్ణమోహన్, శ్రీనివాస్, హరికృష్ణ, గ్రామ పెద్దలు శంకర్ అల్లే, జనార్ధన్, వెంకట్ పటేల్, డిస్కో సాయిలు, తదితరులు ఉన్నారు.