Paidi Rakesh Reddy | ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో గురువారం ఈ పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఎవరైనా ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఆర్మూర్ మున్సిపల్ అధికారులు కూడా 10 ప్లస్ జాగలకు కంచే వేయాలని కమిషనర్ రాజుకు సూచించారు. ఎవరైనా ప్రభుత్వ భూములను అక్రమించినట్లయితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.