నింబాచల క్షేత్రం భక్తజన సంద్రమైంది. నృసింహుడి నామస్మరణతో మార్మోగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన లక్ష్మీనర్సింహాస్వామి రథోత్సవానికి జనం పోటెత్తారు. భక్తుల జయజయ ధ్వానాల నడుమ స్వామి వారు అందంగా అలంకరించిన రథంపై ఊరేగారు.
అంతకు ముందు ఆలయ ధర్మకర్తలు శాస్ర్తోక్తంగా పూజాది కైంకర్యాలు నిర్వహించారు. బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్, రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి తదితరులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నృసింహుడి దర్శనం కోసం వేలాది భక్తులు తరలిరాగా, ట్రాఫిక్‌ను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు.
– భీమ్‌గల్, నవంబర్ 15