నవీపేట, అక్టోబర్ 5: నవీపేట మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన మేకల సంత కిటకిటలాడింది. దసరా పండుగ నేపథ్యంలో రూ.3 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, గుజరాత్ తదితర రాష్ర్టాల నుంచి వ్యాపారులు, కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ అయింది.
జీవాలతో వచ్చిన వాహనాలను పార్కింగ్ చేసేందుకు స్థలం సరిపోక నానా తంటాలు పడ్డారు. రోడ్డుపైనే జీవాలను విక్రయించడంతో ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్సై వినయ్ సిబ్బందితో వచ్చి ట్రాఫిక్‌ను నియంత్రించారు.