ఇందల్వాయి, జనవరి 31 : మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో ఉన్న గడీ వద్ద శీలం జానకీబాయి విగ్రహావిష్కరణతోపాటు గ్రంథాలయాన్ని జానకీబాయి మనుమరాలు అనురాధరెడ్డి, తహసీల్దార్ వెంకట్రావు, సీఐ మల్లేశ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జానకీబాయి మనమరాలు అనురాధరెడ్డి మాట్లాడుతూ..
పుట్టిన ఊరు కోసం ఏదో చేయాలన్న సంకల్పం ఉన్నదని తెలిపారు. గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తేలు విజయ్‌కుమార్, ఎంపీటీసీ అశ్విని శ్రీనివాస్, ఉపసర్పంచ్ నవీన్‌గౌడ్, నాయకులు ఎల్ఐసీ గంగాధర్, వీడీసీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.