నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 4 : రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు అందజేసేందుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో అధికారులు, సిబ్బంది గురువారం దరఖాస్తులను స్వీకరించారు. పలు గ్రామాల్లో అధికారులు కార్యక్రమాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ నెల 6వ తేదీలోగా ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ధర్పల్లి మండలంలోని కళాశాల తండా (మోబీన్సాబ్ తండా)లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎంపీవో రాజేశ్ ప్రారంభించి, దరఖాస్తులను స్వీకరించారు. సర్పంచ్ మంజుల, అధికారులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్పల్లి, ఎల్లారెడ్డిపల్లిలో తహసీల్దార్ వెంకట్రావు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీడీవో రాములునాయక్, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు జీపీ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. మండలంలో ఇప్పటివరకు 12,356 దరఖాస్తులను స్వీకరించినట్లు ఎంపీడీవో లక్ష్మీప్రసాద్ తెలిపారు. తహసీల్దార్ రవీందర్రావు, సర్పంచ్ ఇజాప లక్ష్మీ నర్సయ్య పాల్గొన్నారు.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పథకాల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు సూచించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్లో గురువారం ఆరు గ్యారంటీలపై దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రజాపాలన దరఖాస్తుల్లో సమగ్ర సమాచారం ఉండాలని బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి అన్నారు. బోధన్ పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన ఆర్జీల స్వీకరణ కేంద్రాలను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో కమిషనర్ ఎండీ ఖమర్ అహ్మద్, డీఈఈ లింగంపల్లి శివానందం, మేనేజర్ నరేందర్, కౌన్సిలర్లు తూము శరత్‌రెడ్డి, పిట్ల సత్యనారాయణ, అల్తాఫ్ పాల్గొన్నారు.
భీమ్‌గల్ పట్టణ కేంద్రంలో 5, 12 వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి విజయ్‌కుమార్ పరిశీలించారు. పురాణీపేట్, సికింద్రాబాద్‌లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రత్యేకాధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీవో రాజేశ్వర్ ప్రారంభించారు.
బోధన్ మండలంలోని ఊట్పల్లి, రాజీవ్‌నగర్ తండా గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోధన్ తహసీల్దార్ గంగాధర్ కోరారు. ఈనెల 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. దరఖాస్తు ఇవ్వని వారు ఆయా గ్రామాల కార్యదర్శులకు కూడా ఇవ్వవచ్చన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ విఠల్, అధికారులు ఏపీఎం వినోద్ తదితరులున్నారు.
ఎడపల్లి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ప్రజా పాలన కార్యక్రమాలు కొనసాగాయి. మండల కేంద్రంలో 8 కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ధర్పల్లి, జనవరి 4 : మండలంలో ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు 38 మంది ఆపరేటర్లను నియమించినట్లు ఎంపీడీవో లక్ష్మణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు షిఫ్టుల్లో డాటా ఎంట్రీ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల తదుపరి ఆదేశాల మేరకు ఆరు గ్యారెంటీలకు సంబంధించి చర్యలు చేపడుతామని, ఈనెల 17 వరకు డాటా ఎంట్రీ కార్యక్రమం పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.