ఆర్మూర్ పట్టణం మామిడిపల్లిలోని మోడల్ స్కూల్కు వెళ్లే రోడ్డుపై ఏర్పడిన గుంతలు విద్యార్థులకు ఇబ్బందికరంగా మారాయి. చిన్నపాటి వర్షానికి గుంతల్లో నీరు నిలువడంతో రోడ్డు గుండా పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు జంకుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.