బోధన్/మోర్తాడ్/వేల్పూర్/ఆర్మూర్‌టౌన్/మాక్లూర్/ఎడపల్లి/కోటగిరి, ఫిబ్రవరి 26: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈనెల 27న నిర్వహించే పోలింగ్‌ను ప్రశాంతంగా జరిపిం చాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అంకిత్ సూచించారు. బుధవారం బోధన్ పట్టణం లోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రం, పోలింగ్ కేంద్రాలను ఆయన సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేం ద్రాలకు వెళ్తున్న పీవోలు, ఏపీవోలకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పూర్తి సామగ్రి పంపిణీ చేయాలని, మరోమారు పరిశీలిం చుకోవాలన్నారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్‌శాఖ వారికి ఆదేశించాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ విఠల్‌తో పాటు సిబ్బంది ఉన్నారు.
కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఏర్గట్లలో ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేశారు. కమ్మర్పల్లి మండలంలో 1021 గ్రాడ్యుయేట్, 61 టీచర్ ఓట ర్లు, మోర్తాడ్ మండలంలో 671 గ్రాడ్యుయేట్, 61 టీచర్ ఓటర్లు, ఏర్గట్ల మండలంలో 304 గ్రాడ్యు యేట్ 17 మంది టీచర్ ఓటర్లు ఉన్నారు. ఎన్నికలకు ఆయా మండలాల తహసీల్దార్లు ఏర్పాట్లు పూర్తి చేయగా బుధవారం ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వేల్పూర్ మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసి న పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ సంతోష్ పరిశీ లించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి వసతి, ఓటు హక్కును వినియోగించడానికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తహసీల్దార్ తెలిపారు.
ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ ఆవరణ లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆర్డీవో రాజాగౌ డ్ ఎన్నికల సామగ్రిని అధికారులు, సిబ్బందికి అం దజేశారు. అధికారులకు పలు సూచనలు, సలహా లు చేశారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల ను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని జోనల్ అధికారి, తహసీల్దార్ ఆకుల శేఖర్ తెలిపారు.
ఎడపల్లి మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎడపల్లి తహసీల్దార్ కె.ధన్వాల్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కోటగిరి మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తహసీల్దార్ గంగాధర్ తెలిపారు. కోటగిరి హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది సామగ్రితో చేరుకున్నారని, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.