బాన్సువాడ : టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC elections ) కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బాన్సువాడ, బీర్కూర్ మండలంలో పట్టభద్రుల పోలింగ్ మధ్యాహ్నం సమాయానికి 35.34 శాతం పోలింగ్ నమోదు కాగా, బాన్సువాడ డివిజన్ లోని బాన్సువాడ, బీర్కూర్, నస్రూల్లాబాద్, నిజాంసాగర్, మద్నూర్, బిచ్కుంద,జుక్కల్, పెద్దకొడపగల్, డోంగ్లి, పిట్లం మండలాల్లో ఉపాధ్యాయుల పోలింగ్ 48.55 శాతం నమోదైందని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub Collector Kiranmai ) తెలిపారు. బాన్సువాడ డివిజన్ కేంద్రం తో పాటు అన్ని మండల కేంద్రాలలో పోలింగ్ కేంద్రాలను పోలింగ్ సరళిని ఆమె పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలవద్ద పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు.