CP Sai Chaitanya | నిజామాబాద్‌లో ఉత్సాహభరితంగా పోలీసు క్రీడలు.. ప్రారంభించిన సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 క్రీడలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య గురువారం ప్రారంభించారు.
CP Sai Chaitanya | నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 క్రీడలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ క్రీడా వేదికల వద్ద ఏర్పాటు చేసిన స్విమ్మింగ్, సైక్లింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, వాటర్ స్పోర్ట్స్ తదితర క్రీడా పోటీలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల సౌకర్యార్థం ఆయా క్రీడా ప్రాంగణాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, పోటీలను సజావుగా నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పోలీస్ క్రీడాకారులు ఈ క్రీడా పోటీలలో పాల్గొన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుంటూ, క్రీడాస్ఫూర్తి, పట్టుదల, క్రమశిక్షణతో పోటీలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధి నిర్వహణతో పాటు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, పరస్పర స్నేహభావాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. పోలీస్ క్రీడాకారులకు తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు, ప్రతిభను వెలికితీసేందుకు, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందేందుకు మంచి అవకాశం లభిస్తోందని పేర్కొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chris Gayle | వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా సాధ్యమేనేమో.. వైభవ్ అద్భుత ప్రదర్శనపై క్రిస్ గేల్ ఆశ్చర్యం..!
Demolitions | రేవంత్ రెడ్డి గంట పర్యటన కోసం రోడ్డున పడ్డ 50 కుటుంబాలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేత ఫైర్
వైరాలో టిప్పర్ ఢీకొని మహిళ మృతి
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Tension | పోటాపోటీగా సాగర్ నీటి విడుదల.. ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

