కంఠేశ్వర్, అక్టోబర్ 23: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది బుధవారం నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ.26 వేలు చేయాలని, రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
బీఎల్టీయూ అధ్యక్షుడు దండి వెంకట్, బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షురాలు సబ్బాని లత, ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, వాటర్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు రాహుల్, హరీశ్ పాల్గొన్నారు.