Kotagiri | సేంద్రియ విధానం ఎంతో మేలు.. రుద్రూర్ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు
రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయడంతో ఆరోగ్యకరమైన పంటల దిగుబడితోపాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వ్యవసాయ పరిశోధన స్థానం రుద్రుర్ శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య, మంజు భార్గవి అన్నారు.
Kotagiri | కోటగిరి, మే 1 : : రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయడంతో ఆరోగ్యకరమైన పంటల దిగుబడితోపాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వ్యవసాయ పరిశోధన స్థానం రుద్రుర్ శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య, మంజు భార్గవి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏప్రిల్ 30 నుండి మే 23 వరకు నిర్వహించే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పోతంగల్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో రైతులతో సమావేశం నిర్వహించి పంటల సాగు సస్యరక్షణ పై అవగాహన కల్పించారు.
శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య, మంజు భార్గవి మాట్లాడుతూ వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందడానికి రసాయనాలు అధికంగా లేదా తప్పుగా వాడితే నేల ఆరోగ్యం పర్యావరణం మరియు మన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందన్నారు. పంట అవసరాలు, నేలలోని పోషకాల స్థాయి కీటకాల ప్రబలత వంటి అంశాలను పరిగణoలోకి తీసుకొని సరైన మోతాదు సరైన సమయంలో సరైన విధానంలో ఎరువులు మరియు రసాయనాలు వాడాలని సూచించారు. భూసార పరీక్ష ఆధారంగా ఎరువులను వాడాలన్నారు. కీటకాలు తెగుళ్లు ఉన్నప్పుడే మందులు వాడాలని సిఫారసు చేసిన మోతాదులోనే కీటక నాశకాలు వాడాలని సూచించారు. రసాయనాలు, ఎరువులను సమంజసంగా ఉపయోగించడం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందడమే కాకుండా భూమి ఆరోగ్యాన్ని మరియు ప్రకృతి వనరులను కూడా సంరక్షించుకోవచ్చని సూచించారు. రైతులు శాస్త్రీయ సూచనలు పాటించి సమతుల్య మరియు అవసరానికి అనుగుణంగా ఎరువులు రసాయనాలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంధ్య హనుమండ్లు, ఉమ్మడి కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, డైరెక్టర్ సాయిలు, పోతంగల్ మండల వ్యవసాయ అధికారిణి నిషిత, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

