నందిపేట్, డిసెంబర్ 19 : ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్టపై రూ.8 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రాబో యే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేప డతామని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీ ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గుట్టపై జరుగుతు న్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పెద్ద ఎత్తున అతిథి గృహాలు నిర్మించడానికి ప్రతిపాదించిన స్థ లాన్ని పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దుల గుట్టను మ హోన్నతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన నిర్మాణాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్ వచ్చే నెలలో సిద్దుల గుట్ట పర్యటనకు వస్తున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. కేసీఆర్ చేతులమీదుగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉంటాయన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్‌చైర్మన్ మున్నాబాయి, సిద్దుల గుట్ట చైర్మన్ శేఖర్‌రెడ్డి, కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, సర్వసమాజ్ అధ్యక్షుడు మహేశ్, సుంకరి రవి, నవీన్ పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్, మామిడిపల్లి శివారులో చేపట్టిన మేస్త్రీ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రవిగౌడ్, ఇట్టెడి నర్సారెడ్డి, సీనియర్ నాయకులు మోత్కూరి లింగాగౌడ్, మున్నూరు కాపు మేస్త్రీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.