కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని ఓంకారేశ్వర ఆలయం (Omkareshwar Temple) తృతీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయం ఆవరణలో లోక కళ్యాణార్థం గౌరీ సమేత ఓంకారేశ్వర్ స్వామి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. అర్చకులు అవినాష్ పంతులు ( Avinash Pantulu ) ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
ప్రతి ఒక్క లింగాయత్‌లు తమ ఇంట్లో లింగ పూజ చేసుకోవాలని సూచించారు. శివపార్వతుల కల్యాణానికి సుమారు 2వేల మంది భక్తులు హాజరయ్యారు. డప్పు, వాయిద్యాల మధ్య స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది. శివపార్వతులకు మహిళలు ఓడి బియ్యం పోసి మొక్కులను తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన డబ్బులతో దండగా మార్చి స్వామివారికి వేశారు.
అనంతరం ఆలయం ఆవరణలో అన్నప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు కదుల ప్రభాకర్, కంది శివరాములు, పట్టంశెట్టి శ్రీనివాస్, మాదంశెట్టి ఆంజనేయులు, జీవన్ దేశాయ్, పటేల్ రాజు, గంజి సంగమేశ్వర్, ఆంజనేయులుస్వామి, మారుతి, ఇంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.