జిల్లా కేంద్రంలో గ్యాంగ్‌వార్
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, ఘర్షణలు, దాడులు జరగకుండా సీపీ నాగరాజు కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
- ఓ గ్యాంగ్ సభ్యుడిపై ప్రత్యర్థుల దాడి
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
- పలువురిపై హత్యాయత్నం కేసు నమోదు
- పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించిన సీపీ
- లెక్కచేయకుండా వ్యవహరిస్తున్న పాత నేరస్థులు
నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 11: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, ఘర్షణలు, దాడులు జరగకుండా సీపీ నాగరాజు కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రౌడీ షీటర్లను పూర్తిగా కట్టడి చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, మళ్లీ గొడవలకు దిగితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. అయినప్పటికీ జిల్లా కేంద్రంలో కొంత మంది రౌడీ షీటర్లలో మాత్రం మార్పు రావడం లేదు. రెండు రోజు ల క్రితం జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధన్ బస్టాండ్ ఏరియాలో ఓ హోటల్ వద్ద రెండు గ్యాంగుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
నగరంలోని లైన్‌గల్లీ ప్రాంతంలో నివాసం ఉండే షేక్ ఇమ్రాన్ అనే యువకుడిపై ఈ నెల 9వ తేదీన ఓ గ్యాంగ్ సభ్యులు దాడి చేశారు. మూడు సంవత్సరాల క్రితం జరిగిన గొడవను మనస్సులో పెట్టుకొ ని ఉస్మాన్ అనే యువకుడు తన అనుచరులతో కలి సి దాడికి పాల్పడ్డాడు. తనపై ఉస్మాన్, ఆరిఫ్ (ఆరిఫ్ డాన్), కాలమోల ఆరిఫ్, బర్సత్ అమీర్, అజ్మతుల్లా ఖాన్‌తో పాటు మరికొంతమంది కలిసి దాడి చేసినట్లు షేక్‌ఇమ్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశా డు. ఈ దాడిలో షేక్ ఇమ్రాన్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఐ దుగురితో పాటు వారి అనుచరులైన మరికొంత మందిపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 341,307,506 ఆర్/డబ్ల్యూ 341 ఐపీసీ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
రౌడీ షీటర్లు ఎంత మంది ?
నగర నడిబొడ్డున రెండు గ్యాంగుల మధ్య జరిగిన దాడి సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మా రింది. గ్యాంగులు దాడులకు దిగడం సినిమా వా తావరణాన్ని తలపించిందని హోటల్ వద్ద చూసిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఈ రెం డు గ్యాంగుల్లో రౌడీషీటర్లు సైతం ఉన్నట్లు స్థానిక యువకులు చర్చించుకుంటున్నారు.అయితే రౌడీ షీటర్లు ఉంటే పోలీసులు ఎలా స్పందిస్తారనే చర్చ సైతం జరుగుతున్నది.
పీడీ యాక్ట్ అన్నా భయం లేదా?
తరచూ గొడవలు, అల్లర్లకు పాల్పడే వారిపై సం బంధిత పోలీసులు నిఘా పెట్టి వారు తమ పద్ధతి మార్చుకోకపోతే వారిపై పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా రౌడీషీట్ నమోదు చేస్తారు. అంతే కాకుండా వారు తమ ప్రవర్తన మార్చుకొని మంచి వా రిగా మారేందుకు అవకాశం కల్పిస్తారు. దీంతో పాటు రౌడీషీట్ నమోదైన వారి ఫొటోలను పోలీస్ స్టేషన్ల బోర్డుపై పెడతారు. అలాంటి వారు అప్పటికీ తమ నడవడిని మార్చుకోకపోతే చివరిగా పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతారు. పాత రౌడీ షీటర్లు తమ పద్ధతులను మార్చుకోవాలని సీపీ అవకాశం కల్పించినప్పటికీ కొంతమందిలో మార్పు రావడంలేదు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

