నిజామాబాద్, సెప్టెంబర్ 1, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా వి.సత్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన నిజామాబాద్ పోలీస్ బాస్‌గా నియమితులయ్యారు. ఇంతకు ముందు సీపీగా కేఆర్ నాగరాజు పని చేశారు. ఈయన మార్చి 31న పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి ఇన్చార్జి సీపీగా నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం కొత్త సీపీని నియమించడంతో కమిషనరేట్‌లో పరిపాలన గాడిలో పడనున్నది.