ఎల్లారెడ్డి, నవంబర్ 21: మండలంలోని సోమిర్యాగడి తండాలో నిర్వహించిన పోడుభూముల గ్రామసభకు ఎల్లారెడ్డి ఆర్డీ వో శ్రీను హాజరయ్యారు. గ్రామంలోని 11 దరఖాస్తులను పరిశీలించి, ఆరు దరఖాస్తులు అర్హత కలిగినవని ఎంపికచేశారు. వాటిని డివిజనల్ స్థాయి కమిటీకి అందజేస్తామని ఆర్డీవో తెలిపారు. వారి పరిశీలన అనంత రం కలెక్టర్కు నివేదిక అందజేయడం జరుగుతుందన్నారు. తహసీల్దార్ సుధాకర్, ఎఫ్ఆర్వో ఓంకార్, సర్పంచ్ రవి, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, సర్వేయర్ అభిలాష్, పం చాయతీ కార్యదర్శి వెంకట్మ్రణ పాల్గొన్నారు.
అర్హులకు త్వరలో పట్టాలు..
బిచ్కుంద, నవంబర్ 21: మండలంలోని శాంతాపూర్ పంచాయతీ పరిధిలో ఉన్న హనుమాన్ తండాలో పోడు భూములపై గిరిజనులతో అధికారులు గ్రామ సభను ఏర్పాటుచేశారు. ఎంపీడీవో ఆనంద్ మాట్లాడుతూ.. అర్హులైన గిరిజనులకు ప్రభుత్వం త్వరలో పట్టాలను అందజేస్తుందని తెలిపారు. తండాలో పోడు భుములు సాగుచేసుకుంటున్న, ఇండ్లు నిర్మించుకుంటున్న గిరిజనుల పేర్లను చదివి వినిపించారు. కార్యక్రమంలో గిర్దావర్ సాయిబాబా, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.
గ్రామసభలు నిర్వహించాలి..
లింగంపేట, నవంబర్ 21: మండలంలోని ఆయా పల్లెల్లో గ్రామ సభలను నిర్వహించాలని ఎంపీడీవో నారాయణ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ భూముల సమస్య పరిష్కారం కోసం అటవీ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సంయుక్తంగా సర్వే నిర్వహించారని తెలిపారు. సర్వేలో గుర్తించిన వాటి వివరాలను గ్రామసభలు నిర్వహించి వెల్లడించాలని ఆయన పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సమావేశంలో మండల పంచాయతీ అధికారి ప్రభాకర్ చారితో పాటు ఆయా పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.
వివరాలు గ్రామసభలో వెల్లడి..
పిట్లం, నవంబర్ 21: మండలంలోని కోమటిచెర్వుతండాలో తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో వెంకటేశ్వర్ సోమవారం పోడు భూములపై గ్రామసభ నిర్వహించారు. సభలో రైతులు దరఖాస్తు చేసుకున్న భూముల సర్వే వివరాలను వెల్లడించారు. నివేదికలను జిల్లా అధికారులకు పంపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో సర్పంచ్ దేవారావు, ఫారెస్ట్ బీట్ అధికారి రవికుమార్, పంచాయతీ కార్యదర్శి అమర్నాథ్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.